Telangana| జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్న తెలంగాణ.. ఎస్‌డీపీలో అగ్రస్థానానికి రాష్ట్రం
దేశ ఆర్థిక రాజధానిగా అవతరించే దిశగా తెలంగాణ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే అనేక అంశాల్లో శిఖర స్థాయికి చేరిన రాష్ట్రం, తాజాగా మరో ఘనత సాధించింది. పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (ఎన్ఎస్డీపీ) లో పెద్దపెద్ద రాష్ర్టాలన్నింటినీ వెనక్కి నెట్టి దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థికశాఖ, పథకాల అమలు శాఖ ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదికలోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నది.
- ఎన్ఎస్డీపీలో మొదటి స్థానంలో తెలంగాణ
- అత్యధికంగా సంపాదిస్తున్నది తెలంగాణీయులే
- తలసరి ఆదాయంలో ఇప్పటికే మొదటి స్థానం
- దేశానికి గరిష్ఠంగా ఆదాయం ఇస్తున్నదీ మనమే
- కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల్లోనే తేటతెల్లం
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక రాజధానిగా అవతరించే దిశగా తెలంగాణ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నది. ఇప్పటికే అనేక అంశాల్లో శిఖర స్థాయికి చేరిన రాష్ట్రం, తాజాగా మరో ఘనత సాధించింది. పర్ క్యాపిటా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (ఎన్ఎస్డీపీ) లో పెద్దపెద్ద రాష్ర్టాలన్నింటినీ వెనక్కి నెట్టి దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థికశాఖ, పథకాల అమలు శాఖ ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదికలోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నది.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉత్పాదకత సాధించాడు అనే అంశాన్ని ఎన్ఎస్డీపీ తెలుపుతుంది. అంటే ఒక పౌరుడు ఏడాదిలో ఎంత సంపద ఆర్జించాడో తెలిపేదే ఎన్ఎస్డీపీ. కేంద్ర గణాంకాల ప్రకారం ప్రస్తుత ధరల్లో 2022-23లో తెలంగాణ ఎన్ఎస్డీపీ రూ.3,08,732గా ఉన్నది. తెలంగాణ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (రూ.3,01,673), హర్యానా (2,96,685) ఉన్నాయి. బీజేపీ పాలిత ఇతర డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు. తలసరి ఆదాయంలో ఇప్పటికే తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.12 లక్షలు.
తెలంగాణ ఎన్ఎస్డీపీ
2014-15 1,24,104
2017-18 1,79,358
2022-23 3,08,732
ఎన్ఎస్డీపీ టాప్ 3 రాష్ర్టాలు (రూ.ల్లో)
తెలంగాణ 3,08,732
కర్ణాటక 3,01,673
హర్యానా 2,96,685
150 శాతం వృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ 9 ఏండ్లలో రాష్ట్ర ఎన్ఎస్డీపీ ఏకంగా 150 శాతం పెరిగింది. 2014-15లో రూ.1,24,104 ఉన్న ఎన్ఎస్డీపీ 2022-23 నాటికి రూ.3,08,732కు చేరింది. 2017-18లో రూ.1,79,358 ఉన్న ఎన్ఎస్డీపీ నాలుగేండ్లలోనే 72 శాతం ఎగబాకింది. 2014-15 నుంచి 2022-23 మధ్య రాష్ట్ర తలసరి ఆదాయం 81 శాతం పెరిగింది. గత కొంత కాలంగా రాష్ర్టానికి రావాల్సిన పన్నుల్లో తగ్గుదల కనిపించినా దేశ జీడీపీకి తెలంగాణ రాష్ట్రమే ప్రధాన మద్దతుదారుగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ కితాబివ్వటం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

