పోలీసుల వేధింపులకు యువకుడి బలి!
పోలీసుల వేధింపులకు ఓ యువకుడు బలైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ధరూర్ మండలం బూరెడ్డిపల్లికి చెందిన కుర్వ వీరేశ్ (28) గతంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇటీవల ఓ కేసు విషయమై ఎస్సై,
- ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్, ప్రజాసంఘాలు
- న్యాయం చేయాలంటూ గద్వాలలో ధర్నా
గద్వాల/ధరూరు, అక్టోబర్ 16 : పోలీసుల వేధింపులకు ఓ యువకుడు బలైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ధరూర్ మండలం బూరెడ్డిపల్లికి చెందిన కుర్వ వీరేశ్ (28) గతంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇటీవల ఓ కేసు విషయమై ఎస్సై, పోలీసులు స్టేషన్‌కు పిలిచి అకారణంగా దాడి చేసి, డబ్బులు లాక్కున్నారని, తాను తప్పు చేయకున్నా హింసించారని వీరేశ్ సోషల్ మీడియా వేదికగా వాపోయారు. అవమానం భరించలేక నాలుగు రోజులు క్రితం పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు ఏపీలోని కర్నూల్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
వీరేశ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, ప్రజాసంఘాల నాయకులు, కుటుంబసభ్యులు గద్వాలలోని ఫ్లైఓవర్ ప్రధాన రహదారిపై మృతదేహంతో బైఠాయించారు. డీఎస్పీ మొగులయ్య వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా సదరు పోలీసులు బాధిత కుటుంబసభ్యుల నుంచి ఫోన్‌పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడంతోపాటు నగదు కూడా తీసుకున్నట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. దీంతో సదరు ఎస్సై, పోలీసు సిబ్బందిని వీఆర్‌కు అటాచ్ చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

