Telangana voters list | తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల
Telangana voters list | రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి.
న్యూఢిల్లీ: రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. తొలిగించిన ఓట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి.
మొత్తం ఓటర్లలో ట్రాన్స్జెండర్లు 2,557 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇక 3.17 కోట్లకు పైగా ఉన్న ఓట్లలో మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉన్నట్లు ఓటర్ల జాబితా స్పష్టంచేసింది.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, వివిధ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటన రేపటితో ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
Oo Torture Prema | ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

