కేంద్ర ప్రభుత్వంపై గిరిజనుల ఆగ్రహం.. మోదీ దిష్టిబొమ్మ దహనం
సూర్యాపేట : జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు తమ వద్దకు చేరలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సూర్యాపేట గిరిజన లోకం భగ్గుమన్నది. కేంద్రం తీరును నిరసిస్తూ గిరిజన సోదరీ సోదరమణులు ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్లా జెండాలు ప్రదర్శించి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఎస్ఆర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా గిరిజన నేతలు మాట్లాడుతూ.. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంపలేదని తప్పుడు వ్యాఖ్యలు చేసిన బిశ్వేశ్వర్‌ను కేబినెట్ నుంచి బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిరిజన సోదరులకు తెలుసన్నారు. బిల్లు తమ వద్దకు చేరిందని కేంద్ర హోంశాఖ కూడా అక్నాలెడ్జ్ చేసిందన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కూడా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పిందన్నారు. ఇప్పుడేమో అసలు అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్దకు రానేలేదని పార్లమెంట్లో దారుణంగా అబద్ధలాడటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులను అవమానించడమే అని మండిపడ్డారు. గిరిజనుల తో పెట్టుకున్న ఏ కేంద్ర ప్రభుత్వం బతికి బట్టకట్టలేదన్న నేతలు.. దేశ వ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న గిరిజన లోకాన్ని ఏకం చేసి కేంద్రం పై పోరు బాట చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన గిరిజనులతో పాటు నేతలు ఎంపీపీ కుమారి బాబు, లచ్చి రాం నాయక్, సర్పంచ్ లు బికారు, అనీల్, నాగు నాయక్, బిక్షం నాయక్, కౌన్సిలర్ లింగా నాయక్, వాంకుడోతు వెంకన్న, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

