CIFNET లో సీటు సాధించిన తెలంగాణ గురుకుల విద్యార్థి
CIFNET | కేరళ కొచ్చిలోని CIFNET ( Central Institute of Fisheries Nautical and Engineering Training ) ప్రవేశ పరీక్షలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ( TSWR ) విద్యార్థి మెరిశాడు. బెల్లంపల్లి సెంటర్

హైదరాబాద్ : కేరళ కొచ్చిలోని CIFNET ( Central Institute of Fisheries Nautical and Engineering Training ) ప్రవేశ పరీక్షలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ( TSWR ) విద్యార్థి మెరిశాడు. బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇంటర్ విద్య పూర్తి చేసిన కుమ్మరి అంజిత్ కుమార్.. కొచ్చిలోని CIFNET ప్రవేశం పొందాడు. రాష్ట్రం నుంచి ఎస్సీ కేటగిరి కింద తొలిసారి సీటు పొందిన విద్యార్థిగా అంజిత్ కుమార్ నిలిచాడు. నాలుగేండ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీష్ సైన్స్ కోర్సును అంజిత్ అభ్యసించనున్నారు. అంజిత్ స్వస్థలం.. కోటపల్లి మండలం రోయ్యలపల్లి గ్రామం. అంజిత్ తండ్రి కౌలు రైతు. ఇంటర్లో 96 శాతం మార్కులు, టెన్త్‌లో 9.2 జీపీఏ సాధించాడు అంజిత్.
బుధవారం కొచ్చికి వెళ్లే ముందు అంజిత్ కుమార్ మాట్లాడుతూ.. తన అకాడమిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తానని చెప్పాడు. మత్స్యరంగంలో రాణించాలనుకుంటున్నాని తెలిపాడు. తమ కులానికి (నేతకాని) చెందిన విద్యార్థులు.. ఇలాంటి కోర్సులో ప్రవేశం పొందలేదు. తానే తొలి విద్యార్థిని అని అంజిత్ పేర్కొన్నాడు. తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందించిన బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రిన్సిపాల్ సైదులు, టీచర్లకు అంజిత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

