హైదరాబాద్, మార్చి 13: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన 27 ఏండ్ల వెంకటరమణ పిట్టల హెల్త్ ఇన్ఫర్మేటిక్స్లో ఇండియానా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ నెల 9న స్నేహితులతో కలిసి ఫ్లోరిడాలోని విస్టీరియా ఐలాండ్‌కు వెళ్లాడు. అక్కడ నీటిలో జెట్ స్కీ (బైక్‌లా ఉండే బోట్)పై వెళ్తుండగా, మరో జెట్ స్కీ ఢీకొనడంతో వెంకటరమణ మృతి చెందాడు. 14 ఏండ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, వెంకట రమణ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు అతని స్నేహితులు ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.