Sankranti Holidays | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవును విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు ఆరు రోజులు బడులకు సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు 18న ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ సెలవులను విధిగా పాటించాలని అధికారులు ఆదేశించారు.
29 నుంచి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్-4 పరీక్షలను నిర్వహిస్తారు. జనవరి 13న రెండో శనివారం కాగా, 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలున్నాయి. జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల 13 నుంచి 16 వరకు సం క్రాంతి సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ దీనిని పాటించాలని అధికారులు ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.