‘సమగ్ర శిక్ష’కు ఐఎస్వో గుర్తింపు
తెలంగాణ సమగ్ర శిక్షా విభాగానికి అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ (ఐఎస్వో 9001:2015) లభించిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్రశిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఈ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, విద్యా ప్రమాణాలు పెంపొందించే అంశంలో ఈ గుర్తింపు లభించిందని, ఇది మరింత బాధ్యతతో పనిచేసేందుకు ప్రేరణనిస్తుందని పేరొన్నారు.
- డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్
హైదరాబాద్,ఆక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమగ్ర శిక్షా విభాగానికి అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ (ఐఎస్వో 9001:2015) లభించిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్రశిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఈ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, విద్యా ప్రమాణాలు పెంపొందించే అంశంలో ఈ గుర్తింపు లభించిందని, ఇది మరింత బాధ్యతతో పనిచేసేందుకు ప్రేరణనిస్తుందని పేరొన్నారు. నిరంతర సంసరణల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పనితీరు గ్రేడింగ్ సూచిక ర్యాంకింగ్స్లో తెలంగాణ రాష్ట్రం 28వ స్థానం నుంచి ఏకంగా 18వ స్థానానికి ఎగబాకి గణనీయమైన పురోగతిని సాధించిందని పేరొన్నారు.
విద్యా సమీక్ష కేంద్రం ద్వారా పాఠశాలల పనితీరు, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరును నిరంతరం పర్యవేక్షిస్తూ పాలనలో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. ప్రాథమిక విద్యలో ఎఫ్ఎల్ఎన్, ప్రీ-ప్రైమరీ తరగతులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం భవిత కేంద్రాల ఆధునికీకరణ వంటి సంసరణలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

