దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్

- అన్ని రాష్ర్టాల్లోనూ ఇకపై పంచాయతీ సిటిజన్ చార్టర్
- మన దగ్గర విజయవంతం
- దేశంమొత్తం అనుసరించాలన్నకేంద్ర పంచాయతీరాజ్ శాఖ
- జూలై 1నుంచి స్పెషల్‌డ్రైవ్
గ్రామస్థాయిలో ఏ సేవకు ఎంత సమయం పడుతుందో స్పష్టంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం సిటిజన్ చార్టర్‌ను తయారుచేసి అమలుచేస్తున్నది. దీనిద్వారా ప్రజలకు నిర్దేశించిన సమయంలో సేవలు అందుతున్నాయి. ప్రజల సమస్యలకూ సత్వర పరిష్కారం దొరుకుతున్నది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీల్లో అమలుచేస్తున్న సిటిజన్ చార్టర్ విధానాన్ని అన్నిరాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించింది. ఇందుకోసం జూలై 1 నుంచి ఆగస్టు 15 దాకా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు 15 కల్లా ప్రతి పంచాయతీలో సిటిజన్ చార్టర్ తయారుచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీ అధికారులకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) మంగళవారం ఆన్లైన్లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రామస్థాయిలో ఏ సేవకు ఎంత సమయం పడుతుందో స్పష్టంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం సిటిజన్ చార్టర్‌ను తయారుచేసి అమలుచేస్తున్నది. దీనిద్వారా ప్రజలకు నిర్దేశించిన సమయంలో సేవలు అందుతున్నాయి. ప్రజల సమస్యలకూ సత్వర పరిష్కారం దొరుకుతున్నది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానంలో ప్రజలకు వారు ఎన్నుకున్న పాలకవర్గాలు, అధికారులు జవాబుదారీగా ఉంటారని, పారదర్శకంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓరియెంటేషన్ కార్యక్రమానికి ఆయా రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ రూపొందించిన ఫెసిలిటేటర్స్ ట్రైనింగ్ మాడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి ఆలోక్ ప్రేమ్‌నగర్, ఎన్ఐఆర్డీ డిప్యూటీ డైరెక్టర్ జనరల రాధిక రస్తోగి, ఎన్ఐఆర్డీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కతిరిసేన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

