Fee reimbursement | ఈ నెల 13 నుంచి కాలేజీల బంద్!
Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 13 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించాయి.
- ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రకటన
- రీయింబర్స్మెంట్ చెల్లింపుపై మాటతప్పిన సర్కారు
- రూ.1200 కోట్లు ఇస్తామని.. 200 కోట్లే విడుదల
- 12లోగా వెయ్యికోట్లు ఇవ్వకుంటే ఆందోళనే: ఫతి
- గడువు విధించిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు
- ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకు సిద్ధమని ప్రకటన
Fee reimbursement | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 13 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించాయి. ఈ నెల 12లోగా రూ.1000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే కాలేజీల బంద్ తప్పదని పునరుద్ఘాటించాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) కార్యవర్గం బుధవారం హైదరాబాద్‌లో అత్యవసరంగా భేటీ అయ్యింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో సర్కారు నిర్లక్ష్యంపై చర్చించారు. అనంతరం మీడియాతో ఫతి ప్రతినిధులు మాట్లాడుతూ ఇక నుంచి తాము మంత్రులతో చర్చించబోమని, సీఎం లేదా సీఎంవో నుంచి చర్చలకు ఆహ్వానిస్తేనే వెళ్తామని ప్రకటించారు. ఈనెల 13 -18 లోపు ముఖ్యమంత్రి తమతో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2,500 కాలేజీల యాజమాన్యాలు ఈ సమావేశానికి హాజరవుతాయని ప్రకటించారు.
ప్రైవేట్ కాలేజీలపై శీతకన్ను
ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలపై శీతకన్ను ప్రదర్శిస్తున్నదని ఫతి ప్రతినిధులు ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పాపానికి కాలేజీల్లో పనిచేసే అటెండర్లు దసరా చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. సెప్టెంబర్‌లో తాము బంద్ పాటించినప్పుడు రూ.600 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం, మంత్రులు హామీనిచ్చారని, దీపావళి వరకు మరో రూ.600 కోట్లు ఇస్తామన్నారని వారు గుర్తుచేశారు. తమ ఆందోళనలో భాగంగా ఈ నెల 12 నుంచి 18 వరకు జిల్లాల్లో రోజుకో కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఈ ఆందోళనలు కళాశాలల బంద్, హైదరాబాద్ ముట్టడి, రైల్‌రోకో, నిరాహారదీక్షలు, రాస్తారోకో రూపంలో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఫతి ప్రతినిధులు డిమాండ్‌చేశారు. ఫతి చైర్మన్ రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి కేఎస్ రవికుమార్, కొడాలి కృష్ణారావు, రాందాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎట్టకేలకు 200 కోట్లు విడుదల..
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ఇన్నాళ్లు మీనమేషాలు లెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం బకాయిలు విడుదల చేసినట్టు తెలిసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం కాలేజీలన్నీ ఈ నెల 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు నమస్తే తెలంగాణ ‘మళ్లీ కాలేజీల బంద్’ శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్‌లో కాలేజీల యాజమాన్యాలు బుధవారం సమావేశం కానున్నాయని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని ఆ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం బుధవారం రూ.200 కోట్ల వరకు విడుదల చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

