ఐరాస విధులకు 19 మంది పోలీసులు
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ మిషన్ పరీక్షలో తెలంగాణ నుంచి 19 మంది పోలీసులు ఉత్తీర్ణులయ్యారు.
- అంతర్జాతీయ పీస్ కీసింగ్ మిషన్ పరీక్షలో నెగ్గిన మనోళ్లు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ మిషన్ పరీక్షలో తెలంగాణ నుంచి 19 మంది పోలీసులు ఉత్తీర్ణులయ్యారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఇద్దరు అధికారులు ఇంగ్ల్లిష్, డ్రైవింగ్, ఫైరింగ్ పరీక్షలు నిర్వహించగా, దేశవ్యాప్తంగా 225 మంది పోలీసు అధికారులు హాజరయ్యారు. వీరిలో 164 మంది ఉత్తీర్ణత సాధించారు.
వివిధ రాష్ర్టాల నుంచి ఎంపికైన ఈ 164 మందిలో రికార్డు స్థాయిలో తెలంగాణ నుంచి 19 మంది పోలీసులు అర్హత సాధించారు. వీరిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్‌సింగ్, సీసీఎస్ హైదరాబాద్ ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్, నార్కోటిక్ బ్యూరో ఏసీపీ నర్సింగరావు, కమాండెంట్ అలెక్స్, నార్కోటిక్ బ్యూరో ఏసీబీ చల్లా శ్రీధర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ప్రతాప్, ఏసీపీ జూపల్లి రమేశ్, ఏసీపీ మాజిద్ అలీఖాన్, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ సురేశ్, విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
19 మంది తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ నుంచి ఎంపిక కావడంతో ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. వీళ్లంతా రాబోయే రెండేండ్లలో ఏ దేశంలోనైనా అంతర్గత సంక్షోభం ఎదురైనా, శాంతిభద్రతలు గాడి తప్పినా ఐక్యరాజ్య సమితి తరఫున అక్కడికి వెళ్లి శాంతిభద్రతల పునరుద్ధరణకు కృషి చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

