ఆయిల్‌ఫెడ్‌లో 11 కోట్ల లూటీ.. ఎక్సెస్ టెండర్లలో చక్రం తిప్పిన నంబర్-2 అధికారి, ఓ కీలక నేత
తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో ‘ఎక్సెస్ టెండర్ల’ విషయంలో రూ.11 కోట్ల లూటీ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట, అశ్వారావుపేట, సిద్దిపేట, ఖమ్మం జిల్లా కల్లూరిగూడెం ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల్లో ఐదు రకాల పనులకు వేర్వేరుగా,
- సైట్ విజిట్ సర్టిఫికెట్స్‌తో టెండర్ల పోటీకి అడ్డుకట్ట
- 43.51 కోట్లకు ఐదు పనులు దక్కించుకున్న ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్
దమ్మపేట రూరల్, మే 1 : తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో ‘ఎక్సెస్ టెండర్ల’ విషయంలో రూ.11 కోట్ల లూటీ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట, అశ్వారావుపేట, సిద్దిపేట, ఖమ్మం జిల్లా కల్లూరిగూడెం ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల్లో ఐదు రకాల పనులకు వేర్వేరుగా, ఈ-ప్రొక్యూర్మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా అంచనా విలువ రూ.42.52 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనుల్లో ఎల్-1గా రూ.43.51 కోట్లకు పాల్వంచకు చెందిన ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ మాత్రమే నిలిచింది. ఈ సంస్థ ఎల్-1గా నిలువడానికి ఆయిల్‌ఫెడ్‌లో నంబర్-2గా గుర్తింపు పొందిన అధికారి, ఒక కీలక నాయకుడు అన్నిరకాల సహాయ సహకారాలు అందించినట్టు ప్రచారం జరుగుతున్నది.
వర్కులు ఐదు.. రూ.43.51 కోట్లు
- సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని పామాయిల్ ఫ్యాక్టరీలో అంతర్గత బీటీ రోడ్లు, స్టోమ్ వాటర్ డ్రైన్స్, అడ్మిన్ బిల్డింగ్ నిర్మాణానికి అంచనా విలువ రూ.8,97,94,765కు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌తోపాటు శ్రీకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నాయి. అంచనా విలువపై 3.65 శాతం అధికంగా (ఎక్సెస్)తో ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎల్-1గా, అంచనా విలువపై 4.75 శాతం ఎక్సెస్‌తో శ్రీకో ప్రాజెక్ట్స్ ఎల్-2గా నిలిచాయి.
- సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని పామాయిల్ ఫ్యాక్టరీలో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణానికి అంచనా విలువ రూ.4,54,29,965కు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లల్లో సైతం ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌తోపాటు శ్రీకో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే పాల్గొన్నాయి. ఈ వర్క్‌కు ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ 3.95 శాతం ఎక్సెస్‌తో ఎల్-1 గా, శ్రీకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4.80 శాతం ఎక్సెస్‌తో ఎల్-2గా నిలిచాయి.
- ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరిగూడెంలో నిర్మాణంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో అడ్మిన్ బిల్డింగ్, ఓహెచ్ఎస్ఆర్ (వాటర్ ట్యాంకు), ఎఫ్యూలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇతర పనులకు అంచనా విలువ రూ.20,20,50,804 టెండర్లు పిలిచారు. ఈ వర్క్‌ను అంచనా విలువపై 1.58 శాతం ఎక్సెస్‌తో ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎల్-1 గా, సిస్కాన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంచనా విలువపై 2.58 శాతం ఎక్సెస్‌తో ఎల్-2గా, ఎస్సీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంచనా విలువపై 3.25 శాతం ఎక్సెస్‌తో ఎల్-3గా, శ్రీకో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంచనా విలువపై 3.83 శాతం ఎక్సెస్‌తో ఎల్-4గా నిలిచాయి.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 25 వేల కేఎల్ అండర్‌గ్రౌండ్ పాండ్ నిర్మాణానికి అంచనా విలువ రూ.2,47,50,000కు టెండర్లు పిలువగా ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ అంచనా విలువపై 1.89 శాతం ఎక్సెస్‌తో ఎల్-1, నల్లూరి సత్యనారాయణ అండ్ సన్స్ 2.45 శాతం ఎక్సెస్‌తో ఎల్-2, నందమూరి కన్స్ట్రక్షన్స్ 2.92 శాతం ఎక్సెస్‌తో ఎల్-3, శ్రీకో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3.14 శాతం ఎక్సెస్‌తో ఎల్-4 స్థానాల్లో నిలిచాయి.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పీఈబీ (ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్) ఫెడ్స్, ఎంఈఈ షెడ్, సీసీ రోడ్ల నిర్మాణానికి అంచనా విలువ రూ.6,32,72,912 టెండర్లు పిలిచారు. దీనికి ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ అంచనా విలువపై 1.75 శాతం ఎక్సెస్‌తో ఎల్-1, నల్లూరి సత్యనారాయణ అండ్ సన్స్ 2.70 శాతం ఎక్సెస్‌తో ఎల్-2, శ్రీకో ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2.95 శాతం ఎక్సెస్‌తో ఎల్-3 స్థానాల్లో నిలిచాయి.
పాత టెండర్లన్నీ అంచనా విలువపై లెస్లే…
ఈ టెండర్లు పిలువడానికి ముందు సిద్దిపేట జిల్లా నెర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణానికి జరిగిన టెండర్లలో అంచనా విలువ రూ.19,75,70,006 కంటే 16.89 లెస్తో ఎల్-1 గా, అంచనా విలువ రూ.12,44,62,235 కంటే 17.59 శాతం లెస్తో ఎల్-1గా రెండు వర్కుల్లో సిస్కాన్ కనస్ట్రక్షన్స్ టెండర్ వేసి పనులు దక్కించుకుంది. కల్లారిగూడెంలో నిర్మాణంలో ఫ్యాక్టరీలో పనుల టెండర్లో అంచనా విలువ రూ.18,62,37,654 కంటే 26.79 శాతం లెస్ (తక్కువ)తో ఎస్సీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంచనా విలువపై 26.79 శాతం లెస్తో రూ.13,63,44,586 ఎల్-1గా నిలిచింది.
పోటీ ఉంటే రూ.11.5 కోట్ల వరకు ఆదా..
ఈ పనులన్నింటి అంచనా విలువ రూ.42,52,98,446 కాగా.. అంచనా విలువపై ఎక్సెస్‌కు టెండర్లు ఖరారు కావడంతో అంచనా విలువ పెరిగి రూ.43,51,37,892కు చేరింది. అంచనా విలువకంటే రూ.98,39,446 పెరిగింది. ఇప్పటివరకు జరిగిన టెండర్లలో ఇదే తరహా పనులున్న కల్లూరిగూడెం ఫ్యాక్టరీ పనులు 26.79 శాతం లెస్తో ఎస్సీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.13,63,44,586తో ఎల్-1 దక్కించుకోగా, ఈ పనిని సైతం నంబర్ 2 అధికారి, ఓ కీలక నాయకుడి ఒత్తిడితో సబ్ కంట్రాక్ట్ను ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ తీసుకుని పనులు చేస్తున్నది. దీనిప్రకారం ఈ 5 పనులకు లెస్‌కు టెండర్లు పడితే తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు రూ.11.5 కోట్ల వరకు నిధులు ఆదా అయ్యేవి.
సైట్ విజిట్ సర్టిఫికెట్తో పోటీ నివారణ..
నిబంధనలకు విరుద్ధంగా ‘సైట్ విజిట్’ సర్టిఫికెట్ నిబంధన విధించి టెండర్లలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొనకుండా పోటీని నివారించడంలో నంబర్2 అధికారి, ప్రముఖ నాయకుడు సఫలమయ్యారు. ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థకు ఏకంగా రూ.11.5 కోట్లు లబ్ధి చేకూర్చినట్టయింది. 5 టెండర్లను దక్కించుకున్న ఆర్ఎస్ఎన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌తో కుమ్మక్కై డమ్మీలుగా ఎన్నుకున్న కాంట్రాక్టర్లకు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్లు జారీ చేశారు.
ఆయిల్‌ఫెడ్ చరిత్రలో ఈ టెండర్లకే ఎక్సెస్..!
ఆయిల్‌ఫెడ్ సంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన టెండర్ల చరిత్రలో ఈ ఐదు టెండర్లకే ఎక్సెస్‌తో పడ్డాయని తెలుస్తున్నది. వీటిని మినహాయిస్తే మిగిలిన అన్ని టెండర్లకు లెస్తోనే ఒప్పందాలు జరిగాయి.
కోరిన వారందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చాం..
అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీల్లో పనులకు మాత్రమే ‘సైట్ విజిట్’ సర్టిఫికెట్ నిబంధన పెట్టాం. సైట్ విజిట్ సర్టిఫికెట్ కావాలని కోరిన కాంట్రాక్టర్లందరికీ ఇచ్చాం. గతంలోనూ కొన్ని టెండర్లు ఎక్సెస్‌కు వెళ్లాయి.
-శ్రీకాంత్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

