ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్: మహబూబాబాద్‌లోని వీఆర్ఎన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బీజేపీ మానుకోట నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశానికి జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరండి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాగా వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ‘బాబులాల్ మరండి’కి బదులు ‘బాబులాల్ మారండి’ అని ముద్రించి నవ్వుల పాలయ్యారు.