రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బీసీలు
దేశ చరిత్రలో బీసీ కులాలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు, నిధులు అందిస్తున్నది ఒక్క సీఎం కేసీఆరేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
- 41 బీసీ సంఘాలకు రూ.వేల కోట్ల భూములు
- వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రదాత కేసీఆర్
- బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల వెల్లడి
- కులాలు ఐక్యంగా ఉండాలి: శ్రీనివాస్‌గౌడ్
- ఆత్మగౌరవాన్ని చాటేలా భవనాలు: వద్దిరాజు
- 6 కుల సంఘాలకు స్థల పత్రాలు అందజేత
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో బీసీ కులాలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు, నిధులు అందిస్తున్నది ఒక్క సీఎం కేసీఆరేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రదాత అని, టీఆర్ఎస్ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. ఎంసీహెచ్చార్డీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి గంగుల పాల్గొన్నారు. ఏకసంఘంగా ఏర్పడిన మున్నూరు కాపు, పెరిక, తెలంగాణ మరాఠా మండలి, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, నకాషా/ఆరేటి క్షత్రియ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కేటాయించిన స్థల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. 41 బీసీ కులాలకు రూ.వేల కోట్ల విలువైన 82.30 ఎకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఏకసంఘంగా ఏర్పడిన 24 కుల సంఘాలకు అనుమతి పత్రాలు అందజేశామని, మిగతా కులాలు కూడా వారంలోగా ఏక సంఘంగా ఏర్పడాలని పిలుపునిచ్చారు.
లేకపోతే ప్రభుత్వమే టెండర్లు పిలిచి ఆయా కులసంఘాల భవనాల నిర్మాణం చేపడుతుందని వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పూలే చేసిన రిసెర్చ్ ప్రకా రం కులాలన్నీ ఒకే ఇంటి నుంచి ఉద్భవించాయని, వృత్తుల పరంగా వేరుపడి కులాల రూపాన్ని సంతరించుకొన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో ఒకే తాటిపైకి వచ్చిన వెనుకబడిన కులాలు ఇకముందు అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కుల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా భవన నిర్మాణాలను చేసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ ఆత్మగౌరవ భవనాల కోసం కుల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, డబ్ల్యూఆర్‌డీసీ చైర్మన్ వీ ప్రకాశ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు
ఉప్పల్ భగాయత్‌లో దేవాంగ సంఘ ఆత్మ గౌరవ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్ల విలువైన 33 గుంటల స్థలాన్ని కేటాయించడంపై పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి.. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. స్థల కేటాయింపు నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆగస్టు 14న క్షత్రియ సమాజ్ ఆత్మ గౌరవ భవన్ భూమి పూజకు మఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.
comments
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

