CM Breakfast | 3 శాఖలకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం పర్యవేక్షణ బాధ్యతల.. త్వరలో మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్' పథకం పర్యవేక్షణ బాధ్యతలను మూడు శాఖలకు అప్పగించారు.
- బ్రేక్‌ఫాస్ట్ తయారీపై మధ్యాహ్న భోజన కార్మికులకు త్వరలోనే శిక్షణ
- ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తరచూ తనిఖీలు
CM Breakfast | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకం పర్యవేక్షణ బాధ్యతలను మూడు శాఖలకు అప్పగించారు. పాఠశాల విద్యాశాఖ ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుండగా, మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖలు పథకం అమలును పర్యవేక్షించనున్నాయి. నాణ్యంగా, పరిశుభ్రంగా (హైజీన్) పౌష్టికాహారాన్ని అందించేలా ఆయా పర్యవేక్షిస్తాయి. హెచ్ఎంలు సహా విద్యాశాఖలోని ఇతర అధికారులకు సైతం పర్యవేక్షణ బాధ్యలు అప్పగించగా, ఇతర అవసరాల దృష్ట్యా మిగతాశాఖల సహకారాన్ని తీసుకుంటున్నారు. విద్యాశాఖలో అమలవతున్న కార్యక్రమాలు, పథకాలతో ప్రధానోపాధ్యాయలపై భారం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే వారిపై భారాన్ని తగ్గించడం, మిగతాశాఖలకు భాగస్వామ్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ఇప్పటికే ప్రారంభమైంది. దసరా తర్వాత రాష్ట్రమంతటా అమలుకానున్నది.
పర్యవేక్షణ ఇలా..
- పాఠశాలలో హెచ్ఎం, స్కూల్ క్లాంప్లెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, మండలంలో నోడల్ అధికారులు, జిల్లాలో డీఈవోలు పర్యవేక్షణ జరుపుతారు. ఇతర అంశాల పర్యవేక్షణ కోసం మూడు శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
- జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, డీఈవోలు, సమగ్రశిక్ష కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు పర్యవేక్షణ జరుపుతారు.
- బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలుపై ఇప్పటికే మహిళా శిశుసంక్షేమశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ శాఖ సీడీపీవోలు పథకం అమలు, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఆరోగ్యలక్ష్మి పథకం సహా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే బాధ్యతలను వీరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని చెకింగ్ చేయనున్నారు.
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్లు పర్యవేక్షణ జరుపుతారు. కార్పొరేషన్లలో కమిషనర్లే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. వీరు తమ శాఖలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లతో నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు.
- పరిశుభ్రత, శానిటేషన్ బాధ్యతలను మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖలకు అప్పగించారు. మిగిలిపోయిన ఉపాహారం, విద్యార్థులు తినగా పారేసిన ఆహారాన్ని, వ్యర్థపధార్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం వీరి బాధ్యత.
- టిఫిన్లు తయారుచేయడం, నిర్దిష్ట పరిమాణంలో పదార్థాలను కలపడంపై మధ్యాహ్న భోజన కార్మికులకు నిపుణుల చేత శిక్షణనిస్తారు. ఉదాహరణలో మిల్లెట్ ఇడ్లీలో కాస్త పెరుగు కలుపుతుంటారు. ఇలాంటి చిట్కాలపై త్వరలో కార్మికులకు శిక్షణ ఉంటుంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో శిక్షణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు మూడు సంస్థలను ఎంపికచేశారు.
- స్కూళ్లల్లోని కిచెన్‌షెడ్లను ఆధునీకరిస్తారు. ఇందుకు సాంకేతిక సంస్థల సహకారాన్ని తీసుకుంటారు.
- బ్రేక్‌ఫాస్ట్ స్కీం మానిటరింగ్, ట్రాకింగ్ కోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ను, ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

