Traffic Challan in WhatsApp | వాట్సాప్‌లో ట్రాఫిక్ చలాన్లు.. మెసేజ్ వచ్చిన 45 రోజుల్లో ఫైన్లు క్లియర్ చేయాల్సిందే!
Traffic Challan in WhatsApp | తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. సవరించిన మోటరు వాహనాల నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల జారీ, వాటిపై వచ్చే ఫిర్యాదుల పరిషారం కోసం సరికొత్త విధానాన్ని అమలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
- 45 రోజుల్లో చలాన్లు క్లియర్ చేయాల్సిందే
- ఫిర్యాదుల పరిషారానికి రవాణా, పోలీసు శాఖల అధికారుల కసరత్తు
- కేంద్ర నిబంధనలు అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
Traffic Challan in WhatsApp | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. సవరించిన మోటరు వాహనాల నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల జారీ, వాటిపై వచ్చే ఫిర్యాదుల పరిషారం కోసం సరికొత్త విధానాన్ని అమలు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నెల రోజుల్లోగా వాహన్ పోర్టల్‌లో వాహనదారులు తమ మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలి. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వచ్చే చలాన్లను వాహనదారులకు నేరుగా ఎస్ఎమ్ఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపనున్నారు. వాహనదారులందరూ రాబోయే నెల రోజుల్లోగా తమ ప్రస్తుత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ (http://vahan.parivahan.gov.in)లో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. నెల రోజుల గడువు ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్‌లో నమోదైన నంబర్‌కు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా చలాన్ పంపిస్తే, అది సదరు వాహనదారుడికి చేరినట్టుగానే ప్రభుత్వం భావిస్తుంది.
అభ్యంతరాలు ఉంటే.. ఆన్లైన్లోనే ఫిర్యాదు!
ఒకవేళ వాహనదారుడికి వచ్చిన చలాన్ తప్పుగా పడిందని భావిస్తే, దాన్ని సవాల్ చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది. వాహనదారులు నిర్దేశిత పోర్టల్ ద్వారా తగిన ఆధారాలతో ఆన్లైన్లోనే తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఈ ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారి లిఖితపూర్వక ఉత్తర్వులను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ సమాచారం వాహనదారుడికి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందుతుంది. చలాన్లపై వచ్చే అభ్యంతరాలను పరిషరించడానికి పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం నియమించింది. పోలీస్ విభాగంలో హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి కమిషనరేట్లు ట్రాఫిక్ జోన్ల డిప్యూటీ కమిషనర్లు, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నుంచి ట్రాఫిక్ డీసీపీ, వరంగల్ కమిషనరేట్ నుంచి ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్ కమిషనరేట్ల నుంచి అడిషనల్ డీసీపీ (అడ్మిన్), ములుగు, నారాయణపేట జిల్లాలకు నేరుగా ఎస్పీ, మిగిలిన ఇతర జిల్లాలకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)లను నియమించింది. అలాగే రవాణా శాఖలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ జారీచేసిన చలాన్లపై అభ్యంతరాలు ఉంటే.. ప్రాంతీయ/జిల్లా రవాణా అధికారి (ఆర్టీవో/డీటీవో) పరిషరిస్తారు.
సారథి, వాహన్‌లోకి..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చలాన్ల జారీ విధానాన్ని రాబోయే 6 నెలలోపు పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన సారథి, వాహన్‌లోకి ఈ-చలాన్ సిస్టమ్‌ను మార్చనున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం.. ఏడాది కాలంలో ఏదైనా వాహనం, వ్యక్తి ఐదు లేదా అంతకంటే ఎకువ సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే, వాటిని ప్రత్యేకం గా పరిగణిస్తారు. ఒక సంవత్సరంలో నమోదైన ఉల్లంఘనలను తదుపరి సంవత్సరాల రికార్డును లెకించడానికి పరిగణనలోకి తీసుకోరు. కేవలం మూడు రోజుల్లోనే ఈ-చలాన్ డెలివరీ చేయాలి. ఒకవేళ నేరుగా పంపాల్సి వస్తే 15రోజుల్లోగా సదరు వ్యక్తికి, రిజిస్టర్డ్ యజమానికి అందజేయాల్సి ఉంటుం ది. చలాన్ చెల్లింపు లేదా చాలెంజ్ చేయడానికి గరిష్ఠంగా 45రోజుల గడువు ఉంటుంది. వాహనదారు డు ఆ జరిమానా మొత్తాన్ని అంగీకరించి చెల్లించవచ్చు, లేదా తగిన ఆధారాలతో ప్రభుత్వ పోర్టల్ ద్వారా సవాల్ చేయవచ్చు. ఒకవేళ సంబంధిత అధికారి వాహనదారుడు సమర్పించిన ఆధారాలను రద్దు చేస్తే ఆ చలాన్ చెల్లదు. ఒకవేళ అధికారి మీ అభ్యంతరాన్ని తిరసరిస్తే, ఆ ఆర్డర్ వచ్చిన 30రోజుల్లోగా చలాన్ మొత్తం చెల్లించాలి లేదా చలాన్ మొత్తంలో 50% డిపాజిట్‌చేసి కోర్టును ఆశ్రయించవచ్చు. చలా న్ క్లియర్ చేయకపోతే సదరు వాహనదారుడి డ్రైవిం గ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎ లాంటి అప్లికేషన్లను రవాణా శాఖ ప్రాసెస్ చేయదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

