సోమేశ్‌కుమార్ ఏపీకి బదిలీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తక్షణమే విధుల నుంచి విడుదల (రిలీవ్) చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
- కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- రిలీవ్ చేయాలని రాష్ర్టానికి సూచన
- ఆయనది ఏపీ క్యాడరేనన్న హైకోర్టు
- క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత
- వెనువెంటనే రంగంలోకి కేంద్రం
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తక్షణమే విధుల నుంచి విడుదల (రిలీవ్) చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సోమేశ్‌కుమార్ ఈనెల 12లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల విభాగం (డీవోపీటీ) ఉత్తర్వులు జారీచేసింది. సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన అధికారేనని తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టం చేయడంతో వెంటనే ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సోమేశ్‌కుమార్ ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. ఆయన తెలంగాణ క్యాడర్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్‌కే చెందుతారని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సిఫారసులను హైకోర్టు సమర్ధించింది. ఆ సిఫారసుల ప్రకారం సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్ అధికారేనని, దీనికి వ్యతిరేకంగా గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చింది. క్యాట్ తన పరిధిని అతిక్రమించి వ్యవహరించిందని తప్పుపడుతూ.. క్యాడర్‌ను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందతో కూడిన ధర్మాసనం 89 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర సర్వీసు అధికారుల విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆ కమిటీలో ఉమ్మడి ఏపీ చివరి ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సభ్యుడిగా ఉండటాన్ని సోమేశ్‌కుమార్ తప్పుపట్టడాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని, అందుకోసం తీర్పు అమలుపై 3 వారాలపాటు స్టే విధించాలని సోమేశ్‌కుమార్ తరఫు న్యాయవాది కోరారు. ఆ వినతిని కూడా హైకోర్టు తిరస్కరించింది.
కొత్త సీఎస్‌పై నేడు నిర్ణయం?
తెలంగాణ ప్రభుత్వ తదుపరి సీఎస్ ఎవరనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమేశ్‌కుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాల్సి రావడంతో కొత్త సీఎస్‌గా మరొకరిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. సీఎస్ల సీనియారిటీ తదితర అంశాలను ప్రభుత్వం కూలంకషంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

