హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ సహా కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ హాల్టికెట్లు విడుదలయ్యాయి.
విద్యార్థులు https://tgrjc.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించి విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ ప్రకటనలో తెలిపారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 317 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.