గురుకుల ఉపాధ్యాయుల మెరుపు ధర్నా
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు మంగళవారం మెరుపు ధర్నాకు దిగారు.
- అర్ధరాత్రి అకస్మాత్తు బదిలీలు
- అదనపు టీచర్ల పేరుతో హడావుడి
- సేవాలాల్ బంజారాభవన్ వద్ద ధర్నా
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు మంగళవారం మెరుపు ధర్నాకు దిగారు. ఈ విద్యాసంస్థల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారనే కారణంతో సీనియర్ ఉపాధ్యాయులను అదనపు ఉపాధ్యాయులుగా గుర్తించి అర్ధరాత్రి హడావుడిగా బదిలీ చేసినందుకు నిరసనగా హైదరాబాద్ సేవాలాల్ బంజారాభవన్ వద్ద ఈ ఆందోళన చేపట్టారు. సొసైటీ కార్యదర్శి సీనియర్ ఉపాధ్వాయులను అదనపు ఉపాధ్యాయులుగా గుర్తించి హడావుడిగా బదిలీకి ఆదేశాలు ఇవ్వడాన్ని టీఎస్‌యూటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.
రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో సీనియర్ల అంగీకారం తీసుకోవాలని టీఎస్‌యూటీఫ్ అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి రవి తెలిపారు. బలవంతంగా బదిలీ చేయాల్సి వస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలని, రాత్రి సీనియర్ టీచర్లతో జాబితా విడుదల చేసి తెల్లారేసరికి కౌన్సెలింగ్‌కు రావాలని పిలవడం సమంజసం కాదని పేర్కొన్నారు. అదనపు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే సందర్భంలో రీ డిప్లాయ్‌మెంట్ నిబంధనలు పాటించి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర నిరసన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

