Pending Challans | వాహనదారులకు గుడ్న్యూస్.. ఈ నెల 31 వరకు పెండింగ్ చలాన్ల రాయితీ గడువు పెంపు
రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
- గడువు పొడిగించిన ప్రభుత్వం
Pending Challans | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది. వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకొని పెండింగ్ చలాన్లు మొత్తం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించింది.
టూ, త్రీ వీలర్ వాహనాల చలాన్లపై 80 శాతం రాయి తీ, ఆర్టీసీ బస్సులపై 90 శాతం, లైట్, హెవీ వెహికిల్స్పై 60 శాతం రాయితీ ఇస్తున్నారు. వాహనదారులు పెండింగ్ చలాన్ల వివరాలను www. echallan.tspolice.gov.in/ pu blicviewలో చూసి, చెల్లించాలని సూచించారు. చలాన్లను మీ సేవా, టీ వాలెట్, ఈ సేవా, ఆన్లైన్, పేటీం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు. చలాన్ల రాయితీ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చింది. పెండింగ్ చలాన్లు 3.59 కోట్లు ఉండ గా, ఇప్పటివరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

