తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 403 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాస్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. పదేండ్ల లోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇక మిగతా వయసు గల వ్యక్తులు.. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాలని ఆదేశించారు.
అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, లేని పక్షంలో ఇంటికే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారు తక్షణమే ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించి, మందులు వాడాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రయాణాలు చేకపోవడం మంచిదని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

