పంద్రాగస్టుకు 231 మంది ఖైదీల విడుదల
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకిషన్ సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకిషన్ సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2016, 2020లో 400 మంది ఖైదీలను విడుదల చేసి, 2023లో సత్ప్రవర్తన కింద కొంతమంది ఖైదీల విడుదలకు పూనుకుంది. పౌరహక్కులు, మానవహక్కుల వేదిక రేవంత్ సర్కార్ దృష్టికి ఖైదీల విడుదల అంశాన్ని తీసుకొచ్చాయి. దీంతో కమిటీ వేసి, జీవో ఇచ్చి.. 231 మందిని జనవరి 27న విడుదల చేస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నారు.
గవర్నర్‌కు ఖైదీల విడుదల లిస్టు పంపలేదని.. తాజాగా మూడ్రోజుల క్రితమే ఆ లిస్టును పంపారని తెలిసింది. ప్రభుత్వం విడుదల చేస్తామన్న 231 మంది ఖైదీల్లో 212 మంది యావజ్జీవ,19 మంది ఇతర శిక్షలుపడినవారున్నారు. విడుదల కానున్న వారిలో అధికశాతం చర్లపల్లి జైలు నుంచే ఉన్నారు. జనవరి 26న విడుదల చేస్తామని చెప్పిన వారికే.. ఆగస్టులో మోక్షం కలుగనున్నది. ఆగస్టు 15 విడుదల అవుతామని నమ్మకం పెట్టుకున్నవారి ఆశలు ఆడియాశలుగానే మారాయి. వారంతా అక్టోబర్ 2 కోసం ఎదురు చూడాల్సిందే.
మరిన్ని వార్తలను చదవండి
యువతను గందరగోళంలోకి నెట్టిన కాంగ్రెస్
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్‌ను కాంగ్రెస్ గందరగోళంలోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. యువత కాళ్లావేళ్లాపడి, అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ ప్రకటించారని, చికడపల్లి లైబ్రరీలో ఉద్యోగాల కోసం ప్రచారం చేశారని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వాగ్దానం చేశారని తెలిపారు. హామీలను ఎప్పటిలోగా అమలుచేస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏ హోదాలో నాపై ఫిర్యాదు చేశారు?
- మహేశ్వర్‌రెడ్డిపై దానం నాగేందర్ ఫైర్
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఏ హోదాలో స్పీకర్‌కు మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు?’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోతుందని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదన్నారు. గతంలో మెజార్టీతో గెలిచిన స్థానాల్లో ఈసారి తకువ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

