Telangana | నర్సుల ఆఫీసర్ కల సాకారం.. హోదాలు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Telangana | హైదరాబాద్: తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్' అని పిలిపించుకోవాలని ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కలలు సాకారం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ప్రభుత్వం ఉన్నతీకరించింది.
Telangana | హైదరాబాద్: తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్’ అని పిలిపించుకోవాలని ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కలలు సాకారం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ప్రభుత్వం ఉన్నతీకరించింది. వివిధ హోదాల్లో పేర్లను ‘ఆఫీసర్లు’గా మార్చింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా మార్పు శనివారం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. స్టాఫ్ నర్స్‌ను నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్ నర్స్‌ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా పిలువనున్నారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్‌లను పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్చింది. వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో పేరొన్నది. తాజా ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 14వేల మంది నర్సులకు ప్రయోజనం కలుగనున్నది.
నర్సింగ్ సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు
ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నర్సుల గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నదని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ దవాఖానలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

