3,000 కోట్ల అప్పు.. వారంలోనే రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ
ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభమైన తొలిరోజే ఏకంగా రూ.7,000 కోట్ల భారీ రుణాన్ని సమీకరించిన రేవంత్రెడ్డి సర్కార్.. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే ఓపెన్ మా రెట్ ఈ-వేలంలో పాల్గొని సెక్యూరిటీ బాండ్లు పెట్టి మరో రూ.3,000 కోట్లు రుణ సమీకరణ చేసింది.
- ఆర్బీఐ ఈ వేలంలో తీసుకున్న కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభమైన తొలిరోజే ఏకంగా రూ.7,000 కోట్ల భారీ రుణాన్ని సమీకరించిన రేవంత్రెడ్డి సర్కార్.. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే ఓపెన్ మా రెట్ ఈ-వేలంలో పాల్గొని సెక్యూరిటీ బాండ్లు పెట్టి మరో రూ.3,000 కోట్లు రుణ సమీకరణ చేసింది. తాజా రుణం తో కలిపి ఈ ఒక వారంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు అక్షరాల రూ.10 వేల కోట్లకు చేరింది. 17 ఏండ్ల కాలపరిమితితో 7.97 శాతం వార్షిక వడ్డీకి రూ.1,500 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో 8.07 శాతం వార్షిక వడ్డీకి మరో రూ. 1500 కోట్లు ఆర్బీఐ నుంచి సేకరించింది.
ప్రస్తుత ఆర్థిక సం వత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ప్రభుత్వం రూ.18,900 కోట్ల అప్పు చేసింది. ఇప్పుడు జూలై-సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికానికిగానూ రూ.21,000 కోట్లు అప్పు కావాలని ఆ ర్బీఐకి ప్రతిపాదనలు పంపగా.. అందు లో మొదటి రోజే రూ.7,000 కోట్లు, మంగళవారం మరో రూ.3000 కోట్లు తీసుకున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి సేకరించిన మొత్తం అప్పుల విలువ రూ.28,900 కోట్లకు చేరింది. గత బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణను రూ. 54,009 కోట్లలోపే ప్రతిపాదించినప్పటికీ.. ఒక ఆర్బీఐ నుంచే ఓపెన్ మారెట్ రుణాల రూపంలో ఏకంగా రూ. రూ.85,840 కోట్లు అప్పుగా తెచ్చారు. ఇది బడ్జెట్ ప్రతిపాదనల కం టే 158.93 శాతం అధికం. కాగా, ప్ర స్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ మొత్తం రూ.80,000 కోట్ల రుణ సమీకరణ చేయాలని తాజా బడ్జెట్లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

