అనుమతి లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు: ఈఎన్సీ మురళీధర్
ఈఎన్సీ మురళీధర్| అనుమతి లేని వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఎలా మంజూరు చేస్తారని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించించింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ ద్వారా నిధులు సమకూర్చాలని కేంద్ర

హైదరాబాద్: అనుమతి లేని వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఎలా మంజూరు చేస్తారని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించించింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ ద్వారా నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాధనపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ విషయాన్ని పునరాలోచించాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని, వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖలో పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతుల్లేవని గెజిట్లోనూ పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెలిగొండపై గతంలోనే ఫిర్యాదు చేశామని అందులో ప్రస్తావించారు. అనుమతిలేని ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. నిధులు ఇచ్చేందుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని లేఖలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

