ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్లపై సర్కార్ వివక్ష
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, క్యూర్ ఏరియా స్కూళ్ల మంజూరు, నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నది. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మధిర నియోజకవర్గాలకు పెద్దపీట వేసి, మిగతా నియోజకవర్గాలపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నది.
- టీపీఎస్, ‘క్యూర్’ స్కూళ్ల మంజూరులో తీరని ద్రోహం
- కొడంగల్, మధిర నియోజకవర్గాలకే 14% వాటా
- మిగతా నియోజకవర్గాలకు సర్కార్ మొండిచెయ్యి
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, క్యూర్ ఏరియా స్కూళ్ల మంజూరు, నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నది. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మధిర నియోజకవర్గాలకు పెద్దపీట వేసి, మిగతా నియోజకవర్గాలపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలకు మెండిచెయ్యి చూపుతున్నది.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం స్కూల్‌కు రూ.5 కోట్లు, అశ్వారావుపేట స్కూల్‌కు రూ.6.15 కోట్లు, హసన్‌పర్తి స్కూల్‌కు రూ.6.80 కోట్లు, ఆసిఫాబాద్ స్కూల్‌కు రూ.8.40 కోట్లు, నెల్లికుదురు (మహబూబాబాద్) స్కూల్‌కు రూ.7.50 కోట్లు, కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని సుజాతనగర్ స్కూల్‌కు రూ.8.75 కోట్లు, ఆందోల్‌కు రూ 8.40 కోట్లు, మలుగు స్కూల్‌కు రూ.9.20 కోట్లు, వైరా స్కూల్‌కు రూ.9.23 కోట్లు, జానంపేట (పినపాక) స్కూల్‌కు రూ.9.91 కోట్లు, స్టేషన్‌ఘన్‌పూర్ స్కూల్‌కు రూ.9.90 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. జనరల్ నియోకవర్గాల్లోని స్కూళ్లకు పెద్దపీట వేసింది. శేరిలింగంపల్లి స్కూల్‌కు రూ.101 కోట్లు, రాజేంద్రనగర్ స్కూల్‌కు ఏకంగా రూ.151.61 కోట్లు కేటాయించింది.
వాస్తవానికి తొలుత ఒక్కో నియోజకవర్గంలో ఒక స్కూల్‌ను టీపీఎస్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పిన సర్కార్.. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కు ఏకంగా 10, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నియోజకవర్గమైన మధిరకు 9 స్కూళ్లు కేటాయించింది. అంటే మొత్తం 134 టీపీఎస్‌లలో 14% ఈ రెండు నియోజకవర్గాలకే దక్కాయి. నిధుల కేటాయింపులోనూ ఈ రెండు నియోజకవర్గాలకే పెద్దపీట వేసింది. కొడంగల్‌లోని 10 పాఠశాలలకు రూ.118. 80 కోట్లు, మధిర నియోజకవర్గంలోని 9 పాఠశాలలకు రూ.57.70 కోట్లు కేటాయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోని రెండు పాఠశాలలతోపాటు నాంపల్లి, కల్వకుర్తిలోని పాఠశాలలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

