ప్రవళిక కుటుంబానికి 10 లక్షల పరిహారం
మణుగూరు డిపో కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతదేహానికి ఉస్మానియా దవాఖాన మార్చురీ వద్ద బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై నాగిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- బ్యాంకు ద్వారా ప్రమాద బీమా రూ. కోటి
- తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు: పొన్నం
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: మణుగూరు డిపో కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతదేహానికి ఉస్మానియా దవాఖాన మార్చురీ వద్ద బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై నాగిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రవళిక తల్లి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయడంతో పాటు, బ్యాంకు ద్వారా రూ. కోటి ప్రమాద బీమా అందజేస్తామని తెలిపారు. ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు.
నిందితురాలిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మృతురాలి తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త గుండు వెంకటనాగరాజు 2024లో విధి నిర్వహణలో చనిపోయాడని, కారుణ్య నియామకం కింద కూతురు ప్రవళికకు 2025 డిసెంబర్లో ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు కూతురు కూడా చనిపోవడంతో తనకు దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రవళిక మృతికి సంతాపంగా గురువారం మణుగూరు డిపోలో బంద్ పాటిస్తున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదూరి వెంకన్న చెప్పారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం చెల్లించాలని మాజీమత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

