హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జెన్కోలో అకౌంట్స్ విభాగంలో ఉద్యోగోన్నతులు కల్పించడంపై విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏవోఏటీ) హర్షం వ్యక్తంచేసింది. అన్ని క్యాడర్లల్లో 60 మందికి ఉద్యోగోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం మింట్ కాంపౌండ్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఇందుకు సహకరించిన ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, జెన్కో సీఎండీ హరీశ్, డైరెక్టర్లు కుమార్ రాజా, వీర మహేందర్, సీఏఎఫ్వో సత్యరాజ్‌కు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగోన్నతులు పొందిన వారంతా అంజయ్యను భారీ పూలదండతో ఘనంగా సన్మానించారు.