హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (టీఏఎస్ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ పలు ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రజలు సంబురాల్లో పాల్గొని, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికా నూతన కార్యవర్గం ఎన్నికైంది.
గౌరవ చైర్మన్‌గా సుబ్బారావు కస్తాల, వైస్ చైర్మన్‌గా వేణు యెలిగేటి, అధ్యక్షుడిగా శ్రీనివాస్ తాళ్లూరి, ఉపాధ్యక్షుడిగా మురళీ బండారు, సెక్రటరీ జనరల్‌గా సీతారామరాజు, కోశాధికారిగా శ్రీనివాస్ బొబ్బల, సాంసృతిక కమిటీకి మాధవి బొలిశెట్టి, పీఆర్, మారెటింగ్కు రజినీ పడాల, ఈవెంట్స్‌కు సురేఖ రెడ్డి వాడ్రేవు, అడ్మిన్‌గా రతన్ షెర్లా, ఫుడ్ కమిటీకి సతీశ్ మర్రు, కోర్ కమిటీ సభ్యులు ఎన్నికైనట్టు అసోసియేషన్ తెలిపింది.