కోళ్లఫారంలో సింథటిక్ డ్రగ్స్ తయారీ
మాదకద్రవ్యాల అక్రమ తయారీ, సరఫరాపై జరుపుతున్న దర్యాప్తులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు కీలక ముందడుగు వేశారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మరేగావ్లోని ఓ కోళ్ల ఫారంలో సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 8న కొండమడుగు నుంచి నాగ్‌పుర్ వైపు వెళ్తున్న ఓ కారును బీబీనగర్ పోలీసులు తనిఖీ చేసి, 27.2 కిలోల మెఫెడ్రోన్, 56.98 కిలోల అసిటోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- మహారాష్ట్రలో గుర్తించిన ఈగల్ ఫోర్స్
- 11 మంది అరెస్టు.. పరారీలో 13 మంది
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాల అక్రమ తయారీ, సరఫరాపై జరుపుతున్న దర్యాప్తులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు కీలక ముందడుగు వేశారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మరేగావ్లోని ఓ కోళ్ల ఫారంలో సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 8న కొండమడుగు నుంచి నాగ్‌పుర్ వైపు వెళ్తున్న ఓ కారును బీబీనగర్ పోలీసులు తనిఖీ చేసి, 27.2 కిలోల మెఫెడ్రోన్, 56.98 కిలోల అసిటోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ఉన్న చేతన్ మధుకర్ మెస్రమ్, ముజమ్మల్ హోక్, ఆకాష్ అశోక్ గవాండేను అదుపులోకి తీసుకుని ఈగల్ ఫోర్స్‌కు అప్పగించారు. వీరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈగల్ ఫోర్స్ అధికారులు ఈ నెల 17న మరేగావ్లోని ఓ కోళ్ల ఫారంలో సోదాలు నిర్వహించారు.
అక్కడ మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తున్న రసాయనాలు, పరికరాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు మహారాష్ట్రలోని వసాయికి చెందిన జేఎస్వీ గ్లోబల్స్ సంస్థ యజమాని జైరాజ్ కృష్ణ శెట్టిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని కస్టడీలోకి తీసుకున్నామని, వారిలో జైరాజ్ కృష్ణశెట్టితోపాటు అసోంకు చెందిన సద్దాం హుస్సేన్, ముజమ్మల్ హోక్, విశాఖకు చెందిన రాకేశ్‌వర్మ, నాగ్‌పూర్‌కు చెందిన చేతన్ మధుకర్ మెస్రమ్, నాగ్‌పూర్‌కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే, హైదరాబాద్ చందానగర్‌కు చెందిన రమణమూర్తి, ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కాసాని శ్రీనివాస్, హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన చాగంటి వీరవెంకట లక్ష్మీకుమార్ ఉన్నారని సోమవారం ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో 13 మంది నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

