సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!
సైబర్ నేరస్తులకు మ్యూల్ ఖాతాలను అందించి రూ. కోట్లు దండుకోవడంలో కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారని పోలీసువర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్నినెలల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సంచలనం సృష్టించిన సైబర్ నేరంలో అక్కడి కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్టు తేటతెల్లం కాగా..
- మోసాల్లో ఆరితేరిన కొడారి వెంకటేశ్
- ఇటీవల రూ.55 లక్షల మోసం
- కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
- ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరస్తులకు మ్యూల్ ఖాతాలను అందించి రూ. కోట్లు దండుకోవడంలో కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారని పోలీసువర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్నినెలల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సంచలనం సృష్టించిన సైబర్ నేరంలో అక్కడి కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్టు తేటతెల్లం కాగా.. తాజాగా సెప్టెంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో అరెస్టు అయిన కాంగ్రెస్ నేత కొడారి వెంకటేశ్ పటేల్ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రత్లాం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి తాము పోలీసు అధికారులమంటూ వీడియోకాల్ వచ్చింది. అతనికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయంటూ భయపెట్టారు. పోలీసు అధికారులుగా నటిస్తూ, వాట్సాప్ వీడియో కాల్స్‌లో పోలీసు యూనిఫామ్‌తో కనిపిస్తూ, సుప్రీంకోర్టు పేరుతో నకిలీ పత్రాలను పంపి బాధితుడిని నమ్మించారు.
భయపడిన వ్యాపారి వారు చెప్పిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ఆర్టీజీఎస్ ద్వారా సుమారు రూ.55 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత కూడా మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో అతను మధ్యప్రదేశ్ పోలీసులను ఆశ్రయించాడు. వారు రంగంలోకి దిగి సైబర్ నేరస్తులతోపాటు మ్యూల్ ఖాతాలు అందించి, వారి నుంచి భారీగా కమీషన్ పొందుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కొడారి వెంకటేశ్ పటేల్, మీర్ యూసుఫ్, కర్ణాటకు చెందిన అశోక్, మరో ఇద్దరిని సెప్టెంబర్ 15న అరెస్టు చేశారు. మోసానికి గురైన రూ.55 లక్షల్లో సుమారు రూ.30 లక్షల వరకు వెంకటేశ్ ఖాతాకు బదిలీ అయినట్టు మధ్యప్రదేశ్ సైబర్‌సెల్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మొత్తం వ్యవహారంలో రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాల్లో నిలిపివేసినట్టు రత్లాం ఎస్పీ అమిత్‌కుమార్ వెల్లడించారు.
బిల్డర్లకు బెదిరింపులు.. ల్యాండ్ సెటిల్మెంట్లు
ఆదిలాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత కొడారి వెంకటేశ్ పటేల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తాడని బాధితులు చెప్తున్నారు. అంతేకాకుండా సైబర్ నేరస్తులకు మ్యూల్ ఖాతాలు అందిస్తుంటాడని, అమాయకులైన ఆటోడ్రైవర్లు, ఇండ్లలో ఖాళీగా ఉండే మహిళలు, నిరుద్యోగుల బ్యాంకు అకౌంట్లు తీసుకొని.. సైబర్ నేరస్తులకు ఇస్తుంటాడని తెలిసింది. సైబర్ నేరస్థులకు భారీగా మ్యూల్ ఖాతాలను వెంకటేశ్ అందిస్తుండటంతో.. రాత్రికి రాత్రే మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులతో దిగిన ఫొటోలు చూపించడంతో అతడని ప్రజలు నమ్మినట్టు తెలుస్తున్నది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి డీసీసీ ప్రకటించిన కోఆర్డినేటర్లలో కొడారి వెంకటేశ్ కూడా ఉండడం గమనార్హం. తాజా కేసులో వెంకటేశ్ ఖాతాకు మళ్లినట్టు చెప్తున్న రూ.35 లక్షల డబ్బు ఎకడికి వెళ్లింది? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నదని రత్లాం ఎస్పీ అమిత్‌కుమార్ స్థానిక మీడియాకు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

