Civils Results | సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలు
Civils Results | ఇవాళ విడుదలైన సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు. నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆలిండియాలో 3వ ర్యాంకు సాధించి.. రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు.
Civils Results | ఇవాళ విడుదలైన సివిల్స్ 2022 తుది ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు. నారాయణపేట ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆలిండియాలో 3వ ర్యాంకు సాధించి.. రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40వ ర్యాంకు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని సుల్తానాబాద్ మండలానికి చెందిన ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన నిరుపేద బిడ్డ డోంగ్రీ రేవయ్య 410వ ర్యాంకు సాధించారు. రేవయ్య ఇంటర్ వరకు గురుకుల విద్యాసంస్థల్లోనే విద్యను అభ్యసించారు. బీటెక్ ఐఐటీ మద్రాసులో చదివారు. రేవయ్య తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తుంది. తండ్రి గతంలోనే మరణించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

