బీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, సుల్తానాబాద్ సీఐ వేధింపులతో తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఓ బీఆర్ఎస్ నాయకుడి భార్య శనివారం ఓ వీడియో విడుదల చేయగా, వైరల్ అయింది. వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ కొయ్యడ అరుణ్‌కుమార్ బీఆర్ఎస్లో నాయకుడిగా కొనసాగుతున్నాడు.
- కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, సీఐ వేధింపులతోనే..
- బాధితుడి భార్య వీడియో వైరల్
పెద్దపల్లి, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, సుల్తానాబాద్ సీఐ వేధింపులతో తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఓ బీఆర్ఎస్ నాయకుడి భార్య శనివారం ఓ వీడియో విడుదల చేయగా, వైరల్ అయింది. వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ కొయ్యడ అరుణ్‌కుమార్ బీఆర్ఎస్లో నాయకుడిగా కొనసాగుతున్నాడు. భూముల పంపకాల విషయంలో అతడి తల్లి, తమ్ముడు అరుణ్‌కుమార్‌తో గొడవకు దిగుతున్నారు. ఈ విషయమై కోర్టును అశ్రయించి ఇంజక్షన్ అర్డర్ తీసుకొచ్చారు. కుటుంబీకులు అరుణ్ కుమార్‌పై సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చే శారు.
దీన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు పోలీసులపై ఒత్తిడి పెంచి వేధింపులకు గురిచేశారని అరుణ్‌కుమార్ భార్య కొయ్యడ స్వప్న ఆరోపించింది. రాజకీయ కుట్రలో భాగంగా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో సీఐ తన భర్తపై ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెంది శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని, కరీంనగర్‌లోని దవాఖానలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఆత్మ హత్యాయత్నానికి కారణమైన సుల్తానాబాద్ సీఐ, అత్త, మరిదిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

