Assembly Session | వారంపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు?
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం కానున్నది.
- నేడు బీఏసీ సమావేశం
- మ.2 గం.లకు క్యాబినెట్భేటీ
Assembly Session | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం కానున్నది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి? వంటి అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సభ సమావేశాలను వారంపాటు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.
పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలు సహా పలు శాఖల బిల్లులు సభకు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. కాగా, గత సోమవారం సమావేశాల ప్రారంభం రోజే తెలంగాణతల్లి నూతన విగ్రహం, రూపురేఖలు వంటి అంశాలపై సభలో చర్చించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులను ఉభయసభల్లోకి ఉద్దేశపూర్వకంగానే రాకుండా చేసి, ప్రభుత్వం చర్చ పెట్టిందనే విమర్శలు వినిపించాయి. తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిని కాదని, అభయహస్తం తల్లిని ఉద్దేశపూర్వకంగా రుద్దాలనే కుట్రను ప్రభుత్వం చేసిందని, ఆ బండారం అంతా తాము బయటపెడతామనే భయంతోనే తమను ముందస్తుగానే సభకు రాకుండా అరెస్టు చేయించిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది.
నేడు క్యాబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానున్నది. శాసనసభ ప్రాంగణంలోని అసెంబ్లీ కమిటీ హాల్-1లో మధ్యాహ్నం రెండు గంటలకు క్యాబినెట్ సమావేశం కానున్నది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై క్యాబినెట్లో చర్చించి, ఆమోదించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

