తెలంగాణ శాసనసభ కార్యదర్శికి కరోనా పాజిటివ్
శాసనసభ కార్యదర్శి | తెలంగాణ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేరి

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనను ఇటీవల కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక వేళ పాజిటివ్ నిర్ధారణ అయితే హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
నిన్న ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటాయి. 24 గంటల్లో 1,005 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ తర్వాత అత్యధికంగా మేడ్చల్‌లో 502, రంగారెడ్డి 373, నిజామాబాద్ 406, మహబూబ్‌నగర్ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

