Telangana Assembly | ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీలో సంతాపం.. ఆయన లేని లోటు తీర్చలేనిదన్న సీఎం కేసీఆర్
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారన్నారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారన్నారు. ఆయన వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు.
ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారన్నారు. సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. అనేక సందర్భాల్లో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాం.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందింది. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు. సాయన్న నిజామాబాద్ జిల్లాలో జన్మించారని, హైదరాబాద్ జీహెచ్ఎంసీలో సెటిలై.. వ్యాపారవేత్తగా ఉన్నారన్నారు. ఆయన వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించిందన్నారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదన్నారు. ఆయన లేని లోటు తీరనిదని, కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

