వరంగల్ : వరంగల్లోని జెమిని ఏషియన్ థియేటర్లో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. కూలింగ్ మిషన్ పవర్ హీట్ కావడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సినిమా చూస్తుండగానే ఈ ప్రమాదం సంభవించడంతో.. ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో థియేటర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.