Teenmar Mallanna | తీన్మార్ మల్లన్న అరెస్ట్
Teenmar Mallanna | ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలపై చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిలకలగూడకు చెందిన సన్నిధానం లక్ష్శీకాంతశర్మ మారుతీ సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయాన్ని

జ్యోతిష్యుడిని బ్లాక్మెయిల్ చేసిన కేసులో అదుపులోకి..
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలపై చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిలకలగూడకు చెందిన సన్నిధానం లక్ష్శీకాంతశర్మ మారుతీ సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కొందరు భక్తుల రూపంలో ఆయనవద్దకు వెళ్లి సమస్యలు సృష్టిస్తూ సోషల్‌మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎలక్ర్టానిక్ మీడియా ద్వారా ఆ జోతిష్యాలయంపై అబద్ధ్దాలను ప్రచారం చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 19న లక్ష్శీకాంతశర్మకు తీన్మార్ మల్లన్న వాట్సాప్ కాల్చేసి ఈ తప్పుడు ప్రచారం ఆపాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. అందుకు శర్మ లొంగలేదు. దాంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా యూట్యూబ్ చానల్స్, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రచారం చేశారంటూ మల్లన్నపై ఏప్రిల్ 20న చిలకలగూడ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, పక్కా ఆధారాలుండటంతో మల్లన్నను శుక్రవారం అరెస్ట్ చేశారు. మల్లన్నపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

