టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ విలీనం
టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ విలీనం | టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ శాసనసభ పక్షం విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ శాసనసభ పక్షం విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు.
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య కొన్నాళ్ల తరువాత టీఆర్ఎస్లో చేరారు.
అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వర్ రావు ఒక్కరే టీడీపీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన సైతం టీడీపీకి రాజీనామా చేశారు.
త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన సీఎం కేసీఆర్‌తో సైతం భేటీ అయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోనూ భేటీ అయ్యారు.
అనంతరం సండ్ర వెంకట వీరయ్యతో కలిసి టీడీపీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్‌కు లేఖ అందించారు.
దీంతో టీడీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి అధికారిక బులిటెన్ జారీ చేశారు. ఈ పరిణామంతో అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

