టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే!.. 119 సీట్లలో 73.39 లక్షలు తొలగింపు.. 39 సీట్లలోనే 39 లక్షలు!
- గులాబీ పార్టీ గెలిచిన స్థానాల్లోనే 53.3శాతం ఓట్లకు ‘సర్’ కత్తెర
- హైదరాబాద్ పరిసర సెగ్మెంట్లలోనే అత్యధికంగా కోత
- మిగతా పార్టీలు గెలిచిన 80 నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్లు 46 శాతం లోపే
రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియలో సుమారు 95 లక్షల ఓట్లను తొలగించబోతున్నారన్న ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం రాజకీయ వర్గాల్లో, పౌరసమాజంలో సంచలనం సృష్టించింది. ఈసీ వర్గాలూ ఉక్కిరిబిక్కిరయ్యాయి. అయితే అధికారులు వెల్లడిస్తున్న గణాంకాల్లోనే మరో విషయం బయటపడింది. బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఏకంగా 53.3 శాతం ఓట్లను తొలగించగా, మిగిలిన 80 నియోజకవర్గాల్లో కేవలం 46 శాతం లోపే ఓట్లను కత్తిరించినట్టు తెలుస్తున్నది.
మొదట బెంగాల్.. తర్వాత తమిళనాడు.. ఇప్పుడు తెలంగాణ సహా పలు రాష్ర్టాలు! నిర్ణాయక శక్తిగా ఉన్న ఓట్లను వేర్వేరు సాకులతో పెకిలించి, ఎన్నికల ముఖచిత్రాన్ని కొందరికి అనుగుణంగా మార్చేందుకు ‘సర్’ ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తున్నది. బలమైన పార్టీలను బలిపీఠం ఎక్కించేందుకు ఓట్ల ఏరివేత పాచికను పారిస్తున్నట్టు తెలుస్తున్నది. తృణమూల్.. డీఎంకే.. తర్వాత ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ను టార్గెట్ చేశారా? అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కాకుండా గులాబీ పార్టీని లక్ష్యం చేసుకోవడం వెనుక మర్మమేంది?
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): బీఆర్ఎస్ పార్టీ ఓటర్లనే ‘సర్’లో టార్గెట్ చేశారా? ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో తొలగించే ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన 39 నియోజకవర్గాల నుంచే ఉన్నాయా? అంటే.. సీఈవో కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాలు ‘అవును’ అనే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ‘సర్’కు ముందు మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యేనాటికి గరిష్ఠంగా 95 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆగస్టు 17న ఈసీ విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గైర్హాజర్, చిరునామా మార్పు, మరణం, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) కింద 73,39,235 మంది ఓటర్లను గుర్తించారు.
ఇందులో 39,12,087 మంది (53.30%) ఓటర్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గె లిచిన నియోజకవర్గాల్లో నుంచే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఏఎస్‌డీడీ క్యాటగిరీలో గుర్తించిన ప్రతి ఇద్దరిలో ఒకరికిపైగా బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల నుంచే ఉన్నారు. బీఆర్ఎస్ గెలిచిన స్థానాల నుంచే ఇంతపెద్ద సం ఖ్యలో ఓటర్లు ఈ క్యాటగిరీలోకి రావడం ‘సర్’ ప్రక్రియపై అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఓట ర్ల జాబితా సవరణలో ఈ గణాంకాలు ఒక పార్టీ ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ గెలిచిన 39 చోట్లే 39.12 లక్షలు!
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన 39 నియోజకవర్గాల్లో ఏఎస్‌డీడీ క్యాటగిరీ ఓటర్లు 39,12,087 మంది ఉన్నట్టు సీఈవో కార్యాలయం విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాటగిరీలో గుర్తించిన 73,39,235 మందిలో వీరి వాటా 53.3శాతం. ఏఎస్‌డీడీ క్యాటగిరీ ఓటర్ల సంఖ్య హైదరాబాద్ పరిసర నియోజకవర్గాల్లో భారీగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. శేరిలింగంపల్లిలో 3,29,828 మంది, కుత్బుల్లాపూర్‌లో 2,76,924, ఎల్బీనగర్లో 2,70,284, రాజేంద్రనగర్‌లో 2,47,005, మహేశ్వరంలో 2,35,331, ఉప్పల్‌లో 2,18,323, మేడ్చల్‌లో 2,13,122, మలాజిగిరిలో 1,92,957, జూబ్లీహిల్స్‌లో 1,79,51, కూకట్‌పల్లిలో 1,70,240 మంది ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
2023 ఎన్నికల్లో పై అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు గెలిచిన 80 నియోజకవర్గాల్లో గల్లంతయ్యే ఓట్లు దాదాపు రెట్టింపు సంఖ్యలో ఉండాలి. కానీ ఆ నియోజకవర్గాల్లో కేవలం 34,27,148 (46.7%) మంది ఓట్లు మాత్రమే తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మిగతా పార్టీలు గెలిచిన 80 చోట్ల కంటే, బీఆర్ఎస్ గెలిచిన 39 చోట్ల 4,84,939 ఓట్లు ఎక్కువగా గల్లంతయ్యే అవకాశం ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.
‘సర్’ వింతలు ఇలా..
‘సర్’ ముసాయిదా ప్రకారం ఏఎస్‌డీడీ పేరిట తొలగించనున్న ఓట్లు 73,39,235
2023లో బీఆర్ఎస్ గెలిచిన 39 చోట్ల తగ్గనున్న ఓట్లు 39,12,087 (53.3%)
2023లో మిగతా పార్టీలు గెలిచిన 80 చోట్ల తగ్గనున్న ఓట్లు 34,27,148 (46.7%)
మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ గెలిచిన చోట్ల అధికంగా తొలగించనున్న ఓట్ల్లు4,84,939

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలు ఇవే..


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

