తమ్మినేని కృష్ణయ్య దారుణహత్య
- టీఆర్ఎస్ నేతను నరికి చంపిన ప్రత్యర్థులు
- అట్టుడికిన ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి
- కృష్ణయ్య మృతదేహానికి తుమ్మల నివాళి
- కుటుంబాన్ని ఓదార్చిన మాజీ మంత్రి
ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నేత, సహకార సంఘం డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ, ఆధిపత్య అంశాలే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నది. సహకార సంఘం డైరెక్టర్ హోదాలో కృష్ణయ్య సోమవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు రైతు వేదిక వద్ద పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తన అనుచరుడు ముఖేశ్‌తో కలిసి బైక్‌పై తిరిగి వస్తున్నారు.
ఆయన కదలికలను గమనిస్తూ వెం టాడిన దుండగులు.. తెల్దారుపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలో ఉన్న దోభీఘాట్ వద్ద కృష్ణయ్య ప్రయాణిస్తున్న బైక్‌ను ఆటోతో ఢీకొట్టారు. వెనుక కూర్చున్న కృష్ణయ్య కింద పడిపోగానే కత్తులతో దాడి చేశారు. తొలుత రెండు చేతులనూ నరికేశారు.
తల భాగంపై విచక్షణారహితంగా నరికారు. కృష్ణయ్యతో ఉన్న ముఖేశ్.. ప్రాణభయంతో పరుగులు తీశాడు. హత్య చేసిన దుండగులు అదే ఆటోలో పారిపోయారు. దోభీఘాట్ స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగులు ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగానే ఎంచుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లి అట్టుడికి పోయింది. ఆయన అభిమానులు కట్టలు తెంచుకున్న ఆవేశంతో గ్రామంలోని తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు.
కృష్ణయ్య మరణానికి కారకులంటూ ఆరోపించారు. ఇంట్లో ఉన్న కారు, బైకులు, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను నిలువరించారు. మొదట్లో సీపీఎంలో పనిచేసిన కృష్ణయ్య.. కొన్నేండ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నా రు. ఇదే గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దగ్గరి బంధువు కృష్ణయ్య.
తెల్దారుపల్లిలో గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణయ్య భార్య విజయం సాధించారు. సహకార ఎన్నికల్లోనూ కృష్ణయ్య టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. అప్పటివరకు ఏకపక్షంగా ఉన్న తెల్దారుపల్లి రాజకీయాల్లో ఈ రెండు ఎన్నికలతో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామంలో క్రమంగా టీఆర్ఎస్ బలపడుతుండటంతో రాజకీయ పోరు తారస్థాయికి చేరుకున్నది. ఈ క్రమంలోనే కృష్ణయ్య హత్యకు గురయ్యారు.
హత్యా రాజకీయాలు సహించం : తుమ్మల
కృష్ణయ్య హత్య ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతదేహాన్ని చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. కృష్ణయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. తన భర్త హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు, వీరభద్రమే కారకులంటూ విలపిస్తూ కృష్ణయ్య భార్య, ఎంపీటీసీ మంగతాయి.. తమ్మినేనికి వివరించారు.
హత్యా రాజకీయాలు సరికాదని, ఈ తరహా ఘటనలు టీఆర్ఎస్ సహించబోదని తుమ్మల స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వీరయ్య తదితరులు కృష్ణయ్య మృతదేహానికి నివాళులర్పించారు. ఘటన జరిగిన తీరుపై ముఖేశ్‌ను పోలీసులు ప్రశ్నించారు. కృష్ణయ్య హత్యలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు భావిస్తున్నారు. అదనపు డీసీపీలు శబరీశ్, సుభాశ్ చంద్రబోస్ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

