Minister Srinivas Goud | గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas Goud | జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో తెలంగాణ గ్రామీణ క్రీడాకారులు రాణించేలా వారి ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud)అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : క్రీడా రంగంలోనూ తెలంగాణ సత్తా చాటేలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud)అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల జిల్లా యువజన సర్వీసుల శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష (Sports review) సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్(CM KCR ) ఆదేశాల మేరకు భవిష్యత్‌లో దేశంలో జరిగే అన్ని క్రీడాంశాలలో తెలంగాణ క్రీడాకారులు ఇతర రాష్ట్రాల క్రీడాకారుల కంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పతకాలు సాధించడంలో ముందుండాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ క్రీడాకారులలో( Rural Sports persons) ఉన్న ప్రతిభను వెలికి తీయాలని లక్ష్యంతో మండలం, జిల్లా , రాష్ట్రస్థాయిలో సీఎం కప్(CM Cup) నిర్వహించనున్నామని పేర్కొన్నారు. త్వరలో సీఎం కప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్(Summer Camps) క్యాంపులను విజయవంతం చేసేలా స్వచ్ఛంద సంస్థలను, కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను పూర్తికి ప్రత్యేక చొరవ చూపాలని వెల్లడించారు. సీఎం కప్పు నిర్వహణపై త్వరలో ఉద్యోగ సంఘాలు, క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ , రాష్ట్ర క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, దీపక్, చంద్రారెడ్డి, డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

