రెజ్లర్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రెజ్లర్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో కుస్తీ పోటీల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న తెలంగాణ భవన్లో కేసరి కుస్తీపోటీలు నిర్వహించనున్నామని ప్రకటించారు.
- రేపు తెలంగాణ భవన్లో కేసరి కుస్తీ పోటీలు
- ముఖ్య అతిథిగా కేటీఆర్: తలసాని
హైదరాబాద్, జూలై 22 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రెజ్లర్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో కుస్తీ పోటీల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న తెలంగాణ భవన్లో కేసరి కుస్తీపోటీలు నిర్వహించనున్నామని ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు. అంతకుముందు సీనియర్ రెజ్లర్లు, వ్యాయామశాలల నిర్వాహకులతో సమావేశమయ్యారు. కుస్తీ పోటీల నిర్వహణపై చర్చించారు. అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, రెజ్లర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. చారిత్రక ప్రాధాన్యమున్న క్రీడలను ప్రోత్సహించేందుకు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు హాజరయ్యే రెజ్లర్లకు ట్రస్ట్ ద్వారా ట్రాక్, షూస్ అందజేయడంతో పాటు రవాణా ఖర్చులను భరిస్తున్నామని వెల్లడించారు. అలాగే 70 అఖాడాలకు కుస్తీ పోటీల ప్రాక్టీస్ కోసం మ్యాట్లను అందజేస్తామని చెప్పారు.
తెలంగాణ నుంచి అనేక మంది రెజ్లర్లు జాతీయస్థాయి పోటీలకు హాజరై పతకాలు సాధించారని గుర్తుచేశారు. హైదరాద్ జిల్లా రెజ్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌యాదవ్, సంతోష్‌యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు గుర్రం వవన్కుమార్గౌడ్, సాదం బాలరాజుయాదవ్, శైలేందర్, రెజ్లర్లు గులాబ్‌సింగ్, సాయికృష్ణ, అభిమన్యుయాదవ్, యోగేశ్యాదవ్, మెట్టు శివకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

