హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవెల్లి వెళ్లేందుకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎర్రవెల్లిలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి వెళ్తుండగా ఆయనను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంబర్‌పేట పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయమే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.