ఈయూలో ఎన్నికల దుష్ప్రచారంపై నిఘా
డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్ చెప్పారు.
- తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ
- తెలంగాణ సీఈవోకు ఈయూ పార్లమెంట్ డీజీ వెల్లడి
- డిజిటల్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే మార్గాలపై చర్చలు
- యూరప్‌లో కొనసాగుతున్న రాష్ట్ర సీఈవో పర్యటన
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్ చెప్పారు. ఐరోపా దేశాల్లో ఎన్నికల విధానంపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి యూరోప్‌లో పర్యటిస్తున్నది. ఈ బృందం మంగళవారం మాంగోల్డ్‌తో సమావేశమైంది. ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్ మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకొనే అంశంపై చర్చించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా తెలంగాణ బృందం యూరప్‌లో పర్యటిస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈయూ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ విధానం, ఫేక్‌న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్డ్ వివరించారు. సీఈవో సుదర్శన్‌రెడ్డి భారత ఎన్నికల విధానాన్ని సమగ్రంగా వివరిస్తూ, వృద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హకు వినియోగించేలా భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

