సురవరం.. తెలంగాణ ఆణిముత్యం

- పుట్టినగడ్డ ఖ్యాతిని దశదిశలా చాటారు
- ప్రతాప్‌రెడ్డికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాళి
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ)/వనపర్తి: ప్రముఖ సామాజిక చరిత్రకారుడు సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణలో పుట్టిన ఆణిముత్యమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శ్లాఘించారు. ప్రతాప్‌రెడ్డి 125వ జయంతి సందర్భంగా శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాప్‌రెడ్డి అన్నారు. తెలంగాణను ఎవరైనా కించపరిచినా, చిన్నచూపు చూసినా ఆయన ఏమాత్రం సహించేవారు కాదని, ఎందులోనూ తెలంగాణ తక్కువ కాదని దేశానికే చాటిచెప్పారని కొనియాడారు. తెలంగాణలో కవులే లేరని కొందరు ఎద్దేవా చేసినప్పుడు.. మాకూ వందలాది కవులతోపాటు గొప్ప సాహిత్యం, చరిత్ర ఉందంటూ ప్రతాప్‌రెడ్డి ధైర్యంగా పోరాడారని, గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణ సాహిత్యాన్ని చాటిచెప్పారని తెలిపారు. ప్రతాప్‌రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరలేదని అన్నారు. ప్రస్తుతానికి ప్రతి జిల్లాలో జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని, పరిస్థితులు కుదుటపడ్డాక వచ్చే సంవత్సరం ఏడాదిపాటు జయంతి వేడుకలు నిర్వహిద్దామని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. తర్వాత సురవరం ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సన్మానించారు.
సురవరం.. ఓ సాహిత్య శిఖరం:
మంత్రి నిరంజన్‌రెడ్డి
సురవరం ప్రతాపరెడ్డి ఓ సాహిత్య శిఖరమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పలు రంగాల్లో తనదైన శైలిలో ముద్రవేసుకున్న సురవరం జీవితం భావితరాలకు మార్గదర్శకమని చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా వనపర్తి జిల్లాకేంద్రంలోని సురవరం పార్క్‌లో ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం సాహితీవేత్తగా, పత్రిక సంపాదుకులుగా, రాజకీయవేత్తగా పలు రంగాల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన మహనీయుడని
కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

