Revanth Reddy | ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Revanth Reddy | ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు.
Revanth Reddy | న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని సూచనలు చేసింది.
గతంలో ఈ కేసులో రేవంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను రేవంత్ రెడ్డి కలిసి.. డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే, మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా నిలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

