పెండ్లికి ముందు లైంగిక సంబంధంతో క్యారెక్టర్‌ను అంచనా వేయకూడదు
అవివాహితులైన ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరచుకోవడాన్ని వారి చెడు ప్రవర్తనగా చూడరాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ యువతిని ప్రేమించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్న యువకుడు..
- పెండ్లి జరుగకపోతే ఒకరిని ఒకరు మోసం చేశారని భావించలేం
- కానిస్టేబుల్‌గా ఆ యువకుడి ఎంపికను పరిగణించండి
- తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 8 : అవివాహితులైన ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరచుకోవడాన్ని వారి చెడు ప్రవర్తనగా చూడరాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ యువతిని ప్రేమించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్న యువకుడు.. చివరికి ఆమెను పెండ్లి చేసుకోని కారణం గా నమోదైన క్రిమినల్ కేసును పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడిని కానిస్టేబుల్‌గా ఎంపిక చేసేందుకు నిరాకరించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. అవివాహితులైన ఇద్దరు వయోజనులు తమ ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం ఏర్పరచుకోకుండా నిషేధించే చట్టం ఏదీ లేదని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆ యువకుడు చేసిన అప్పీల్‌ను అనుమతించిన ధర్మాసనం, ఈ కేసులో ఆ యువకుడిని కానిస్టేబుల్‌గా ఎంపిక చేసే అంశాన్ని పునఃపరిశీలించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పెండ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి లైంగికదాడికి పాల్పడ్డాడంటూ 2014లో ఆ యువకుడిపై నమోదైన కేసు ఆధారంగా అతడి నైతిక ప్రవర్తనను అంచనా వేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్‌గా అతడి ఎంపికను రద్దుచేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ ‘శారీరక సంబంధం ఏర్పరచుకునే ప్రతి జంట వివాహం చేసుకోకపోవచ్చు. వారి మధ్య వివాహం జరుగలేదు కాబట్టి వారిలో ఒకరు మరొకరిని మోసం చేశారని భావించడానికి ఆస్కారం లేదు’ అని వ్యాఖ్యానించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

