Supreme Court | జీహెచ్ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు చేసిన సుప్రీంకోర్టు
జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టు సొసైటీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వాలు భూములు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాలు బుక్ కేటాయింపులు చేయడాన్ని సవాల్ చేస్తూ రావు బీ చెలికాని సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.
కాగా, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇండ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హౌసింగ్ సొసైటీలు పొందిన భూముల విషయమై సందిగ్ధం నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

