Summer Special Trains | సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు
Summer Special Trains | వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపిస్తుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం(Kollam), పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్(Shalimar), సాంత్రాగాచి లకు రైళ్లను నడుపనున్నామని వివరించారు.
సికింద్రాబాద్-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతి శుక్రవారం బయలు దేరడంతో పాటు ఏప్రిల్ 19 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుదని అన్నారు. ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్చే సాంత్రాగాచి-సికింద్రాబాద్ (07224) రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతుందని తెలిపారు. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు.
సికింద్రాబాద్ -షాలిమార్ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24వ తేదీ వరకు ప్రతి సోమవారం, షాలిమార్-సికింద్రాబాద్(07226) రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం బయలుదేరుతాయని తెలిపారు.
సికింద్రాబాద్ -కొల్లం (07193) మధ్య ప్రత్యేక రైలు ఏప్రిల్ 17,24, మే 1, 8,15,22,29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుందని ఎస్సీఆర్(SCR) అధికారులు వివరించారు. తిరుగుప్రయాణంలో కొల్లం-సికింద్రాబాద్(07194) రైలు ఏప్రిల్ 19, 26, మే 3,10,17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

